Tuesday, July 5, 2016

సాహసమే శ్వాస సాగించునా సంతోషమే శ్వాసతో సాగిపోవునా

సాహసమే శ్వాస సాగించునా సంతోషమే శ్వాసతో సాగిపోవునా 
శ్వాసయే సాహసమై జీవితాలను యుగ యుగాలుగా సాగించునా  || సాహసమే || 

శ్వాసలోని జీవమే ఆయుధమై జీవిత సహాసాన్ని సాగించునా 
శ్వాసలోని భావమే ఊపిరై జీవన సాహస కార్యాలను సాగించునా 

శ్వాసలో స్వర జీవమే ఉచ్చ్వాస నిచ్ఛ్వాసాలతో సాగునా 
శ్వాసలో స్వర బీజమే మహా ప్రాణ వాయువై సాగిపోవునా 

శ్వాసలో ఏ శక్తి ఉన్నదో ధ్యాసలో ఏ మర్మం ఉన్నదో 
శ్వాసలో ఏ ధీక్ష ఉన్నదో ధ్యాసలో ఏ సాధన ఉన్నదో   || సాహసమే || 

శ్వాసలోని శ్వాసయే జీవమై మరో జీవాన్ని సృస్టించునా 
శ్వాసలోని జీవమే మరో శ్వాసగా జీవమై అలాగే సాగునా 

శ్వాసలోని సృష్టి తత్వమే యుగ యుగాలుగా గడిచిపోవునా 
శ్వాసలోని భావమే జీవమై సాహసంతో జీవితాన్ని సాగించునా 

శ్వాసలోనే దైవం ఉన్నది అందులోనే మర్మం ఉన్నది 
శ్వాసలోనే ధ్యానం ఉన్నది అందులోనే బంధం ఉన్నది  || సాహసమే ||

Friday, July 1, 2016

ఈ గీతం సంగీతం ఈ రాగం సుస్వరాగం

ఈ గీతం సంగీతం ఈ రాగం సుస్వరాగం
ఈ చరణం చరిత్రకు సరిగమల గమనం  || ఈ గీతం ||

పల్లవితో సాగే నవ జీవనమే మన ప్రావీణ్యం
గాత్రంతో పాడే రాగమే భవ జీవిత సోపానం

గమకాలతో పాడే సంగీతం సాగర నది తీరం
పదనిసలతో సాగే స్వర రాగం కెరటాల కీర్తం

స్వప్త స్వరాలతో సాగే రాగం మధుర స్వరాగం 
నవ గానాలతో పాడే గీతం సుమధుర సుగంధం  || ఈ గీతం ||

పాటకు ప్రాణం పల్లవిగా పాటలో పరిమళం
మాటకు చరితం చరణంతో కలిగే గౌరవం

ప్రతి పదాన్ని భావనతో పాడితే పాటే మధురం
ప్రతి పల్లవి భావనతో సాగితే గీతమే కమనీయం

రాగాలు నవ విధ భావాల సప్త స్వరాలుగా మన నేస్తం
గీతాలు దశ విధ గానాల దిశ దశాబ్దాలుగా మన కోసం  || ఈ గీతం || 

Wednesday, June 29, 2016

విశ్వమై చూస్తున్నా ప్రతి జీవి కదలికను

విశ్వమై చూస్తున్నా ప్రతి జీవి కదలికను
ఆకాశమై జీవిస్తున్నా ప్రతి అణువు కోసం  || విశ్వమై ||

ప్రతి అణువులో ఆత్మనై ఉంటున్నా పరమాత్మగా
ప్రతి పరమాణువులో స్పర్శనై సాగుతున్నా ధ్యాసగా

ప్రతి రూపం నా మేధస్సులో దాగిన వర్ణ జీవమే
ప్రతి ఆకారం నా యదలో దాగిన శ్వాస స్వభావమే

ప్రతి దేహం నా కోసం జీవిస్తూ విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నది
ప్రతి శ్వాస నాలో కలిగే ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలతో కూడినది  || విశ్వమై ||

ప్రతి క్షణాన్ని ఒక యుగములా పరీక్షిస్తూ సాగుతున్నా
ప్రతి నిమిషాన్ని ఒక రోజులా అన్వేషిస్తూ వెళ్ళుతున్నా

ప్రతి భావన నాలో దాగిన స్వభావమై జీవులతో సాగేను
ప్రతి ఆలోచన నాలో నిక్షిప్తమై విశ్వంతో కలిసిపోయేను

ప్రతి బంధం అనుకున్న విధమై సాగుతున్నదా
ప్రతి అనుబంధం అనురాగమై కలిసిపోతున్నదా   || విశ్వమై ||

ఆత్మనై వచ్చాను అవధూతనై ఉన్నాను

ఆత్మనై వచ్చాను అవధూతనై ఉన్నాను
శ్వాసతో వస్తాను మీ ధ్యాసతోనే ఉంటాను   || ఆత్మనై ||

లోకానికి తెలియని జీవ రహస్యమే మేధస్సులో మర్మమై ఉంచాను
విశ్వానికి తెలుపని జీవ బంధమే దేహ రూపాలతో కలుపుతున్నాను

మనస్సులో ఏమున్నదో మేధస్సులో ఎదున్నదో
విజ్ఞానమే తెలిపేలా నీలోని జిజ్ఞాస గమనించునా

వయసులో ఏమౌతుందో యదలో ఏమౌతుందో
ఆశకే తెలియని అరిషడ్వార్గాలతో సాగించునా    || ఆత్మనై ||

ఏ లోకానికి వెళ్ళినా మానవ మేధస్సు మర్మమై ఉండును
ఏ విశ్వాన్ని చూసినా జీవుల బంధాలు మిళితమై సాగును

విజ్ఞానమే ప్రతి జీవి కదలికకు ఆహారమే ప్రతి జీవి ఆరోగ్యానికి
గమ్యాన్ని చేరుకొనుటకే పూర్వ భవిష్య ఆలోచనలు మేధస్సులో

ధ్యానమే విశ్వ పరంపరల ఆత్మ జ్ఞాన సన్నిధి
ధ్యాసయే జీవ భావ స్వభావాల శ్వాస సంబుద్ధి   || ఆత్మనై ||

Saturday, June 25, 2016

మరణంతో సాగే భావన మేధస్సులో ఆలోచనగా నిలిచిపోయెనే

మరణంతో సాగే భావన మేధస్సులో ఆలోచనగా నిలిచిపోయెనే
మౌనంతో నిలిచిన వేదన భావనతో మనస్సులోనే ఆగిపోయెనే
ఆత్మలో దాగిన విశ్వ భావన శ్వాసతో శరీరాన్ని నిలిపి పోయెనే
శరీరంలో దాగిన అవయవాలన్నీ హృదయాన్ని మరచిపోయెనే
పంచభూతాల సైతం శరీరాన్ని మట్టిలోనే స్తంభింప జేసెనే  

Thursday, June 16, 2016

చక్కనైన ఓ చిరుగాలి ఒక్క సారి వీచి పోవాలి

చక్కనైన ఓ చిరుగాలి ఒక్క సారి వీచి పోవాలి
చల్లనైన ఓ చిరుగాలి నీవే నన్ను బ్రతికించాలి
గాలి చిరుగాలి చల్లనైనా ఓ చిరుగాలి నీవే నాకై రావాలి  || చక్కనైన ||

నీవు లేని నా దేహం శ్వాస లేక అలజడిని సృష్టిస్తున్నది
నీవు లేక నా జీవం ధ్యాస లేక దుఃఖమును కలిగిస్తున్నది

నీవు లేని నాలో ఆవేదన మొదలై ప్రాణాన్ని అలమటిస్తున్నది
నీవు లేక నా ఆత్మ అదిరిపోయి చిందర వందరమై పోతున్నది || చక్కనైన ||

నీ రాకతో నాలో కలిగే స్పర్శతో కొత్త జీవం ఎదగాలి
నీ భావంతో నాలో ఏదో సరి కొత్త జీవితం మొదలాలి

నీవే నా అమర జీవమై నా యదలో నిలిచిపోవాలి
నీవే నా ప్రాణ ధారమై నా శ్వాసలో ఒదిగిపోవాలి     || చక్కనైన || 

నీవే లేవని నేనే లేనని

నీవే లేవని నేనే లేనని
నీవే లేవని నాతోనే వచ్చింది నీ భావన
నేనే లేనని నాలోనే నిలిచింది నా ఆలోచన  || నీవే లేవని ||

నీవే లేని నాకు ఏదీ తోచని భావనగా నిలిచింది
నీవే లేవని నాలో శూన్యమే అంతరించి పోయింది

నీవే లేని నాలో ఏదో సందేహమే కలుగుతున్నది
నీవే లేవని నాలో శ్వాసే కర్పూరమై కరుగుతున్నది  || నీవే లేవని ||

నీవే లేని నాలో ఎన్నో చిత్రములు కనిపిస్తూ ఉన్నాయి
నీవే లేవని నాలో దిక్కులు అన్నీ ఒకటిగానే నిలిచాయి

నీవే లేని నా దేహములో కాంతి లేని మేఘ వర్ణాలు కమ్ముకున్నాయి
నీవే లేవని నా యదలో స్వప్త స్వరములన్నీ మౌనామై పోతున్నాయి  || నీవే లేవని ||