Tuesday, August 2, 2016

ఓ మజిలీ కథనం మహా గొప్ప ఘట్టం

ఓ మజిలీ కథనం మహా గొప్ప ఘట్టం
ఓ బిజిలీ చరితం మహా గొప్ప గమనం  || ఓ మజిలీ ||

క్షణాలుగా సాగే కథనం యుగాలుగా కొనసాగే మజిలీ ప్రయాణం
అడుగులుగా సాగే చరితం పరుగులుగా కొనసాగే అధ్యాయనం

క్షణాలతో అడుగులు కలిసే కాలం ఎక్కడికో చేరిన తీరం
కథనంలో చరితం దాగే విషయం ఎప్పటికో తెలిసే మౌనం || ఓ మజిలీ ||

గమనంతో చరిత్రనే అధ్యాయం చేయగా తెలిసేనే ఓ మజిలీ కథనం
ప్రతి ఘటనలో దాగిన పరవశం ప్రయాణంలో కలిగే ఓ బిజిలీ చరితం

నడిచే దారిలో ఎదురయ్యే కథనాలన్నీ అనుభవాలుగా తెలుసుకునే విజ్ఞానం
తిరిగి వచ్చే మార్గంలో తెలిసే చరితలెన్నో అనుబంధాలుగా తెలిపే ప్రమాణం  || ఓ మజిలీ ||

దిక్కులతో చూపులే చెల్లా చెదురు చుక్కలతో చిక్కులే చిటపటలు

దిక్కులతో చూపులే చెల్లా చెదురు చుక్కలతో చిక్కులే చిటపటలు
ఎక్కడికి వెళ్ళినా చిత్రాలే విచిత్రాలు ఎక్కడ ఉన్నా చివాట్లే తప్పట్లు
ఏదేమైనా మదిలో మైమరిపించే కైపులే యదలో దాగిన ఓర ఇక్కట్లు  || దిక్కులతో ||

విషాదంతో సాగే దిక్కు ఎక్కడికి చేర్చునో చుక్కలుగా తెలియుటలేదే
అశాంతతో తోచే చిత్రం విచిత్రమై మైమరిపించే కైపుగా ఉంటుందేమో

చిక్కులెన్నో లెక్కలుగా దిక్కులకే తోచనట్లు చుక్కలన్నీ ఒకటిగా మారి కనిపించునే
చిత్రాలెన్నో రూపాలుగా నేత్రానికే కనబడనట్లు ఆకారాలన్నీ ఒకటై విచిత్రమయ్యేనే   || దిక్కులతో ||

అసత్యాన్ని చూపే దిక్కు రూపం లేని చిత్రంగా కలవరపడి పోయేనే
అధర్మాన్ని సూచించే కాలం చరిత్రకే లేని వేదంతంగా మారి పోయేనే

ఇబ్బందులతో సాగే జీవితం ఇక్కట్లుగా యదలోనే దుఃఖమైపోయెనే
ఒడిదుడుకులతో సాగే జీవనం చీవాట్లుగా మదిలోనే నిలిచిపోయేనే    || దిక్కులతో || 

ప్రళయం వచ్చే భావన ఎటువంటిదో దుర్ఘటనగా తోచే ఆలోచన ఏమవుతుందో

ప్రళయం వచ్చే భావన ఎటువంటిదో దుర్ఘటనగా తోచే ఆలోచన ఏమవుతుందో
అపాయంతో ఉపాయం లేక విపత్తుతో విధిగా సాగే మహర్షుల విజ్ఞానం ఎందులకో  || ప్రళయం ||

ఆకాశమంతా మేఘాలై జగమంతా మబ్బులే కనిపిస్తూ ప్రళయాన్ని సూచిస్తున్నది
విశ్వమంతా దద్దరిల్లే ధ్వనులతో మేఘాల గర్జనలు విస్ఫోటనమై సందేహిస్తున్నది  

అనుక్షణం చీకటితో ఎక్కడ ఎవరు లేని విధంగా మహా ప్రళయమే జీవిస్తున్నది
ప్రతి నిమిషం శబ్దాలతో సముద్రాల సంగమం కెరటాలతో ఉరకలు వేస్తున్నది    || ప్రళయం ||

విశ్వమంతా మేఘావృతమై సప్త సముద్రాలు ఏకమై ఆకాశమంతా జలపాతమే
మహా సంగ్రామమై కురిసే మేఘ వర్షం తివాచీలా జగమంతా పారే జలపాతమే

వాగులు వంకలు నదులు సప్త సముద్రాలు ఒకటిగా కలిసే ధారతో జలపాతమే
నేల లేని రూపంతో జలధార కెరటాలుగా ఉప్పొంగి ప్రవహించేలా జలపాతమే   || ప్రళయం || 

అటు ఇటు తిరిగే ప్రయాణం ఎక్కడికో

అటు ఇటు తిరిగే ప్రయాణం ఎక్కడికో
ఇటు అటు నిలిచే గమ్యం ఎందులకో ఏమో
ఎక్కడికో తెలియని ప్రయాణం ఎవరికో తెలియని గమ్యం ఎందులకో ఏమో  || అటు ఇటు ||

ప్రయాణంతో సాగే జీవితం గమ్యాన్ని చేరే స్థానం మన జీవన కార్యమేగా
ప్రతి అడుగు ఒక మెట్టుగా ప్రతి సాధన ఒక విజ్ఞాన వేదనగా సాగే వేదికయే

సూర్యునితో సాగే ఉదయం సంధ్య వేళ సూర్యాస్తమయమయ్యే కాల ప్రయాణమే
చీకటిని తొలిచే వెలుగు సూర్యోదయానికి మహోత్తర స్వాగతమయ్యే భ్రమణమే   || అటు ఇటు ||

అన్వేషణగా సాగే విజ్ఞానం అనుభవమయ్యే పరిజ్ఞానం పరిశోధనగా పరిశీలించుటయే
ఆవేదనతో సాగే వేదాంతం అనుబంధాలకు తెలిపే జీవన సూత్రాన్ని భోధించుటయే

కాలంతో కలిగే భ్రమణం మనలో తోచే జ్ఞాపకాల ఆలోచనలు జీవితంలో ఒక ప్రయాణమే
క్షణంతో మొదలయ్యే జీవితం మన ఎదుగుదల ప్రారంభాన్ని చివరిగా సాగించే గమ్యమే || అటు ఇటు || 

Monday, August 1, 2016

ఓం ఓం గణపతి ఓంకార గణపతి

ఓం ఓం గణపతి ఓంకార గణపతి
ఓం ఓం గజపతి ఓంకార గజపతి
ఓం ఓం గణేశ ఓంకారం శ్రీకారం గణేశ || ఓం ఓం ||

ధర్మాన్ని తెలిపే దైవత్వం నీవే
విజ్ఞానాన్ని బోధించే సత్యానివి నీవే
నిత్యం కరుణించే వేదత్వం నీవే    || ఓం ఓం ||


సంతోషాన్ని పంచే మహోత్సవం నీదే
ఆనందం ఇచ్చే ప్రారంభోత్సవం నీదే
స్నేహాన్ని కలిగించే వినాయక ఉత్సవం నీదే  || ఓం ఓం || 

ప్రకృతిలో మొలచినది తల్లి హృదయత్వం

ప్రకృతిలో మొలచినది తల్లి హృదయత్వం
విశ్వమంతా అవతరించినది తల్లి మనస్థత్వం
జగమంతా వ్యాపించినది తల్లి స్వభావ తత్వం  || ప్రకృతిలో ||

ప్రేమామృతమే పంచి ప్రకృతికే మైమరిపించినది
భావామృతమే ఇచ్చి విశ్వాన్ని తిలకింపజేసినది
దైవత్వమే పరచి తన ధర్మాన్ని జగానికి చాటింపజేసింది

తనలోనే తాను జీవిస్తూ తన ప్రతి రూపాన్నే సృష్టిస్తున్నది
తనలోనే తాను ఎదుగుతూ తన స్వభావాన్నే పంచిస్తున్నది
తనలోనే తానూ ఒదుగుతూ తన తత్వాన్నే చూపుతున్నది     || ప్రకృతిలో ||

తల్లిగా జీవించే ప్రతి అమ్మలో దైవమే దాగి ఉన్నది
తల్లిగా లాలించే ప్రతి అమ్మలో భావమే నిండి ఉన్నది
తల్లిగా పోషించే ప్రతి అమ్మలో వేదమే ఒదిగి ఉన్నది

ప్రకృతికే పరమాత్మగా పరమార్థమై ఉన్నది
విశ్వానికే వినయంగా వివేకంతో తెలిపినది
జగతికే విధేయతగా విశాలమై నిలిచింది     || ప్రకృతిలో || 

మాటలో ఏముంది మనస్సులో ఏముంది

మాటలో ఏముంది మనస్సులో ఏముంది
ఆలోచనలో సందేహమై మేధస్సులో సందిగ్ధమైనది  || మాటలో  ||

మాటలకై తడబడిపోయా మనస్సులో తపించిపోయా
ఆలోచనలతో ఏవేవో ఎన్నో ఊహిస్తూ తపనపడిపోయా

విజ్ఞానముతో స్పష్టత లేక మేధస్సులో సందిగ్ధమై పోయేనే
అనుభవంతో పరిచయం లేక మదిలో సందేహమై పోయేనే  || మాటలో  ||

జీవిత కాల ప్రయాణంలో ఏది మహా విజ్ఞానమో తోచటం లేదు
జీవన కాల అభివృద్ధిలో ఏది నిత్య సత్యమో నాలో నిర్ణయం లేదు

తెలుసుకోవాలని ఉన్నా తెలియనిదే ఎంతో ఉందని మనస్సులో అనిత్యం
తెలుసుకున్నది ఏదైనా ఎక్కడ ఉపయోగమవుతుందో మేధస్సుకే సందిగ్ధం || మాటలో  ||