విశ్వమంతా నీవే ఆవహించినావు ప్రభూ
జగమంతా నీవే అధిరోహించినావు ప్రభూ
సూర్యోదయంతో సర్వం నీవే ఆవహించినావు
సూర్యాస్తమంతో నిత్యం నీవే అధిరోహించినావు || విశ్వమంతా ||
విశ్వమంతా ప్రకృతితో పర్యావరణమై నిలిచి ఉన్నావు
జగమంతా ఆకృతితో అంతరిక్షమై విస్తరించి ఉన్నావు
విశ్వమంతా ఎన్నో రూపాలతో పంచ భూతాలుగా ఎదిగున్నావు
జగమంతా ఎన్నో ఆకారాలతో పంచ తత్వాలుగా ఒదిగున్నావు || విశ్వమంతా ||
పరమాత్మగా విశ్వమంతా ప్రకృతిలో ఇమిడిపోయావు
మహాత్మగా జగమంతా ఆకృతిలో నిర్మితమై పోయావు
పరంధామగా నీవే పరిశోధనమై కాలంతో ప్రయాణమై పోయావు
పరంజ్యోతిగా నీవే పరిశీలనమై సమయంతో ప్రధానమై పోయావు || విశ్వమంతా ||

No comments:
Post a Comment