జన్మించగలవా అనంత భావాలతో
మరణించగలవా అనంత తత్వాలతో
సూర్యోదయాన జీవించగలవా అనంత భావాలతో
సూర్యాస్తమున విశ్రమించగలవా అనంత తత్వాలతో || జన్మించగలవా ||
ఉదయించుటలోనే సర్వ భావాల సమయోచితం
అస్తమించుటలోనే నిత్య తత్వాల సమయార్పితం
ఆలోచనలతో కార్యాలను గమనించుటలోనే మేధస్సుకు భావాల సమర్పితం
బంధాలతో కార్యాలను అవగాహించుటలోనే మేధస్సుకు తత్వాల సమర్పణం || జన్మించగలవా ||
సుఖ సంతోషాలతో జీవించుటలో భావాలు శుభ లాభదాయకమై విస్తరించేను
కష్ట నష్టాలతో విశ్రమించుటలో తత్వాలు సర్వ సాధారణత్వమై విస్మరించేను
జీవితంలో కలిగే అనంత భావాలు జీవించుటలో నేర్చే సర్వాంతర వేదాలు
జీవనంలో కలిగే అనంత తత్వాలు జీవించుటలో మార్చే నిరంతర ధర్మాలు || జన్మించగలవా ||

No comments:
Post a Comment