మరచిపోలేవుగా నా శ్వాసను
మరణింపలేవుగా నా ధ్యాసను
దేహములోనే శ్వాసనై ఉన్నాను
మేధస్సులోనే ధ్యాసనై ఉన్నాను
మనస్సుతో మరచిపోయినా వయస్సుతో మరణించెదను || మరచిపోలేవుగా ||
కార్యాలోచనలోనే ధ్యాసనై దేహాలోచనలోనే శ్వాసనై నీలోనే జీవిస్తున్నాను
సర్వాలోచనలోనే ధ్యాసనై నిత్యాలోచనలోనే శ్వాసనై నీలోనే స్మరిస్తున్నాను
జీవం భావం నాలోనే గమనమై శ్వాసతో ఉచ్చ్వాస నిచ్చ్వాసగా సాగేను
దైవం తత్వం నాలోనే ప్రయాణమై శ్వాసతో అభ్యాస అధ్యాసగా సాగేను || మరచిపోలేవుగా ||
జననంతోనే ఆరంభమై మరణంతోనే అంతమై శ్వాసతో ధ్యాసగా జీవించెదను
ఉదయంతోనే శుభమై అస్తమించుటతో విశ్రమై శ్వాసతో ధ్యాసగా స్మరించెదను
మనస్సుతోనే నా ధ్యాస వయస్సుతోనే నా ప్రయాస మేధస్సుతోనే నా జిజ్ఞాస
మనస్సుతోనే నా శ్వాస ఆయుస్సుతోనే నా ప్రయాస మేధస్సుతోనే నా ఆకర్ష || మరచిపోలేవుగా ||
శ్వాసపై గమనంతోనే ధ్యానించెదవని జన్మించాను నీలోనే
శ్వాసపై స్మరణంతోనే జపించెదవని ఉదయించాను నీలోనే
ధ్యాసతో విశ్వమంతా ఉదయిస్తావని నీ దేహంలోనే భావమై చేరుకున్నాను
ధ్యాసతో జగమంతా జీవిస్తావని నీ ఆత్మంలోనే తత్వమై ఆవహించుకున్నాను || మరచిపోలేవుగా ||

No comments:
Post a Comment