తారవో సితారవో నవతారవో నీవు
తేజానివో కాంతివో ప్రకాశానివో నీవు
మెరిసే సువర్ణాలకు చమత్కార వర్ణానివి నీవు
సితార వనితగా విరజిల్లే అనురాగవతివి నీవు || తారవో ||
తేజస్వినిగా తేజస్సులను మెరిపించే ఆకాశ తారవు నీవు
తరంగిణిగా వర్ణాలను కురిపించే జలధార కాంతివి నీవు
ఆకాశానికే అపురూపమైన నవ మోహిని తేజస్సువి నీవు
భువనానికే అద్భుతమైన నవ వాహిని ఉషస్సువి నీవు || తారవో ||
మేధస్సుకే ఆశ్చర్యం కలిగించే సువర్ణ దేహ కాంతివి నీవు
ఆలోచనకే అద్భుతం అనిపించే స్వభావ తత్వానివి నీవు
విశ్వానికి దిక్కులను చూపే మార్గ దర్శక దిక్సూచివి నీవు
జగతికి వెలుగులను తెలిపే మహోదయ సూత్రానివి నీవు || తారవో ||

No comments:
Post a Comment