మరణమిదే మనస్సు తలచిన సమయమిదే
మేధస్సుకే తెలిసి తెలియని భావ తత్వమిదే
జీవమిదే శ్వాస తపించిన ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ఇదే
దేహమిదే హృదయం తెలిపే పర ధ్యాన గమనమిదే || మరణమిదే ||
ఏనాడో జన్మించిన కాలం మరణాన్నే మరచిన సమయం ఏదో
ఏనాడో తలచిన మరణం ఏనాటికో తెలియని సందర్భం ఏదో
జీవించే శ్వాసపై ధ్యాసతో గమనమై జీవించేస్తున్నా
తపించే హృదయమే ధ్యాన గమ్యమై ప్రయాణిస్తున్నా || మరణమిదే ||
తెలియనివి ఎన్నో తెలియుట కొరకే తపనమే సాగుతున్నది
తెలిసినవి ఎన్నో తెలుపుట కోసమే తరుణమే వెళ్ళుతున్నది
ఎన్నెన్నో నేర్చిన వన్నీ మరణ సమయాన్ని తపించలేదే
ఎన్నెన్నో మరచిన వన్నీ మరణ భావత్వాన్ని తెలుపలేదే || మరణమిదే ||