హృదయంలో లేదే నా శ్వాస మేధస్సులో లేదే నా ధ్యాస
నాభి నుండి నాసికమున దాగినదే నా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస
దేహములో కలిగినదే చలన భావాల పర తత్వ అభ్యాస || హృదయంలో ||
నీవే నా శ్వాసగా నేనే నీ ధ్యాసగా ప్రతి సమయం మననం
నీవు నేను ఒకటైతే ఉచ్చ్వాస నిచ్చ్వాసాల పర ధ్యానం
నీకు నాకు కలిగే స్వభావాలే పరమావధీయ పర తత్వం
నీవు నేను ఒకటిగా జీవిస్తే మనలోనే ఒక పర శ్వాస గమనం || హృదయంలో ||
నా శ్వాసతో జీవించవా నాతోనే జీవితాన్ని పంచుకోవా
నా ధ్యాసతో చలించవా నాతోనే జీవనాన్ని సాగించవా
నా భావనతో తపించవా నాతోనే ఆలోచిస్తూ ప్రయాణించవా
నా తన్మయంతో స్మరించవా నాతోనే కాలాన్ని నడిపించవా || హృదయంలో ||